విజయ్ న్యూ మూవీ టైటిల్ పై కసరత్తు

  • ఢిల్లీలో విజయ్ మూవీ షూటింగ్ 
  • న్యూ ఇయర్ కి ఫస్టులుక్
  • విలన్ పాత్రలో విజయ్ సేతుపతి
విజయ్ తన తాజా చిత్రానికి సంబంధించిన పనులతో బిజీగా వున్నాడు. ఇటీవల కార్తీకి 'ఖైదీ' వంటి భారీ హిట్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగ్ కొన్ని రోజులుగా ఢిల్లీలో జరుగుతోంది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో ఈ షెడ్యూల్ ముగుస్తుందట.

కథ ప్రకారం ఈ సినిమాకి 'సభవం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. దాదాపుగా ఇదే టైటిల్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. న్యూఇయర్ కానుకగా టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను జనవరి 1వ తేదీన వదలాలనే ఆలోచనలో టీమ్ వున్నట్టుగా సమాచారం. మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Vijay
Malavika Nair

More Telugu News